పీఏసీఎస్ డైరెక్టర్ పదవులకు రాజీనామా

పీఏసీఎస్ డైరెక్టర్ పదవులకు రాజీనామా

SRPT: మఠంపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ డైరెక్టర్లు 4గురు తమ పదవులకు రాజీనామా చేశారు. మఠంపల్లి PACS కార్యాలయంలో గురువారం సాయంత్రం డైరెక్టర్లు అంతోని, చంద్రం, లింగయ్య, రామనరసమ్మ తమ రాజీనామా లేఖలను సీఈవో తిరుపతయ్య‌కు అందజేశారు. యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.