రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి ఆరా
NDL: శిరివెళ్ల మెట్ట వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందడం బాధాకరమని అన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. హైవేలపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.