స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి: BRS

KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైరా నియోజకవర్గ BRS నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు. బుధవారం ఏన్కూరు మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కేసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు.. అటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.