ఆధునిక సాంకేతికతను వినియోగించాలి: కలెక్టర్
MDK: ఆధునిక సాంకేతికతతో పంటల వివిధీకరణ చేపట్టి ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని కోరారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని, మత్స్య సంపద పెంపుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.