మహాత్మ జ్యోతి బాపూలే ఆశయాలను ఆచరించాలి: ఎమ్మెల్యే

మహాత్మ జ్యోతి బాపూలే ఆశయాలను ఆచరించాలి: ఎమ్మెల్యే

W.G: తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయం వద్ద మహాత్మ జ్యోతి బాపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక అసమానతలను రూపుమాపడానికి, సామాన్యులకు రాజ్యాధికారం దిశగా ఆయన కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. పూలే ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఆచరించాలని పిలుపునిచ్చారు.