'సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించాలి'

KDP: ఖాజీపేట మండలంలో ఎంపీడీవో దివిజా సంపతి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించడంలో భాగంగా పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన పంచాయతీ పురోగతి సూచికపై సమగ్ర అభివృద్ధి పురోగతిని అంచనా వేయడానికి ఉద్దేశించి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.