పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

జనగామలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం పూలే చేసిన సేవలు ఆదర్శమన్నారు. అధికారులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.