అమృత్ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

అమృత్ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

ATP: అమృత్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ హెల్త్ పరిధిలో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను వేగవంతం చేయాలని, గుత్తి, గుంతకల్లులో జరుగుతున్న పనులను వేగంగా చేపట్టాలన్నారు.