జంగంపల్లి ZPHSలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

జంగంపల్లి ZPHSలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

KMR: బిక్నూరు మండలం జంగంపల్లి ZPHSలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు DEO రాజు ఉన్నారు