పంకెనలో కార్డెన్ సెర్చ్.. 10 లీటర్ల గుడుంబా సీజ్
BHPL: పలిమెల మండలం పంకెన గ్రామంలో గురువారం రాత్రి కాటారం డీఎస్పీ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో బృందంతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. యువత నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. తనిఖీల్లో 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. అదనంగా నంబర్ ప్లేట్ లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు