పిల్లలకు పాఠం చెప్పిన MEO

పిల్లలకు పాఠం చెప్పిన MEO

SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంఈఓ నాగారం శ్రీనివాస్ సందర్శించారు. ఈ మేరకు స్థానిక పాఠశాలలో 1, 2వ తరగతి విద్యార్థులకు ఎంఈఓ టీచర్‌గా వ్యవహరించి పాఠం చెప్పారు. బోర్డుపై రాసిన అక్షరమాలిక, పదాలను పిల్లలను చదివించారు. అభ్యాసనలో ప్రతిభ కనబరిచిన పిల్లలను ఆయన ప్రోత్సహించారు. ఇందులో సిఆర్పి క్రాంతి, టీచర్లు ఉన్నారు.