3 గంటలకే 69.69% పోలింగ్
SRCL: వేములవాడ మున్సిపాలిటీలో పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 69.69 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 28 వార్డుల్లో 40,877 మంది ఓటర్లకు గాను 28,495 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం లోపు ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.