గోవా నైట్‌క్లబ్ లైసెన్స్ 2024లోనే పూర్తి..!
గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్లబ్‌కు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ 2024లోనే పూర్తి కాగా.. దీని నిర్వహణ ఇంకా కొనసాగుతోంది. దీనిపై చర్యలు తీసుకునే అధికారం అక్కడి పంచాయతీ అధికారులకు ఉన్నా పట్టించుకోకపోవడం గమనార్హం. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 20 మందిని గుర్తించి వారి స్వస్థలాలకు తరలించారు.