VIDEO: దుబ్బాకలో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం
SDPT: దుబ్బాక పట్టణంలో సోమవారం సాయంత్రం వరి కోసే యంత్రానికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో హార్వెస్టర్ పూర్తిగా దగ్ధమైంది. అక్బర్పేట-బొంపల్లి మండలంలోని మోతే గ్రామానికి చెందిన చంద్రం వరి కోత యంత్రానికి దుబ్బాకలో వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు.