భవనం మంజూరు చేయాలని వినతి
JGL: కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు పక్కా భవనం మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ శివాని సోమవారం అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు భయాందోళనల మధ్య తరగతులకు హాజరవుతున్నారన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా తక్షణమే కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు.