కమ్మ కార్పొరేషన్ ఆఫీస్‌ను ప్రారంభించిన సవిత
AP: గుంటూరు జిల్లాలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి పాల్గొన్నారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా పేదలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేదలైన కమ్మవారికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతోనే ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.