మేడారంలో పర్యటించిన మంత్రులు
ములుగు జిల్లాలోని మేడారంలో ఇవాళ మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. సమ్మక్క - సారలమ్మ గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న గ్రానైట్ పనులు, జంపన్న వాగు వద్ద రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. డిసెంబర్ నెల చివరినాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.