భాషా వివక్ష వద్దు: పవన్ కళ్యాణ్
కర్ణాటకలో తెలుగు సినిమాలపై జరుగుతున్న భాషా వివక్షపై ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ స్పందించారు. అక్కడ తెలుగు పోస్టర్లను వ్యతిరేకించినా, తాను మాత్రం కన్నడ సినిమా ‘కాంతార’కు అండగా నిలబడ్డానని గుర్తుచేశారు. సినిమా ఏదైనా అది 'భారతీయ సినిమా' అని, బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని స్పష్టం చేశారు.