మండల కేంద్రంలో యూరియా అందుబాటులో ఉంది: సొసైటీ ఛైర్మన్

KMM: కామేపల్లి మండల కేంద్రంలోని సొసైటీ గోడౌన్‌లో నిల్వ ఉంచిన యూరియాను శుక్రవారం సొసైటీ ఛైర్మన్ పుచ్చకాయల వీరభద్రం పరిశీలించారు. యూరియా నిల్వలు యొక్క వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సొసైటీ సీఈవో నాగయ్యను సూచించారు. రైతులకు పంపిణీకి సరిపడ యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు.