సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన స్పీకర్

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన స్పీకర్

AKP: పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన లంక వరలక్ష్మికి మంజూరైన రూ.65,594 సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమె కుమారుడు మహేష్‌కు సోమవారం అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి ఒక వరమని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.