ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతి
ATP: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం చికిత్స పొందుతూ ఓ గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. వృద్ధురాలు గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలోని సందర్శనశాలలో ఉంటూ చికిత్స తీసుకుంటుంది. ఆదివారం అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. వృద్ధురాలు వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.