23 కేజీల గంజాయితో ముగ్గురు అరెస్ట్

23 కేజీల గంజాయితో ముగ్గురు అరెస్ట్

SKLM: టెక్కలి రైల్వేస్టేషన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చే మార్గంలో శనివారం ఒరిస్సా రాష్ట్రం రాయఘడ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 23కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నట్లు టెక్కలి సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు. గునుపూర్ నుండి విశాఖ, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు మూడు బ్యాగుల్లో తీసుకువెళ్తున్న క్రమంలో పట్టుబడినట్లు సీఐ తెలిపారు.