'బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలి'
HYD: నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి ఘటన మనసును కలిచివేసిందని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించే ఆర్టీసీ కార్మికుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు.