రాజమండ్రి టూ వైజాగ్.. ఇక డబుల్ స్పీడ్!!

రాజమండ్రి టూ వైజాగ్.. ఇక డబుల్ స్పీడ్!!

E.G: రాజమండ్రి (నిడదవోలు) – విశాఖపట్నం (దువ్వాడ) 3వ, 4వ రైలు మార్గం (198 కి.మీ) నిర్మాణానికి కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. సుమారు ₹9,889 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ హౌరా-చెన్నై హై డెన్సిటీ నెట్‌వర్క్‌లో భాగంగా అమలు కానుంది. ఈ ప్రాజెక్ట్ తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల మీదుగా సాగి తూర్పు తీర పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ అందించనుంది.