VIDEO: మెడికల్ కాలేజీలో ధర్నాకు దిగిన విద్యార్థులు
RR: మహేశ్వరం మెడికల్ కాలేజ్‌లో సోమవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. కాలేజీలో కనీస వసతులు కూడా లేవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బస్ సౌకర్యం, హాస్టల్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకొని అవసరమైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.