గాజులదిన్నెలో 'పల్లెనిద్ర' కార్యక్రమం

KRNL: గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె, గోనెగండ్లలో సీఐ శుక్రవారం రాత్రి 'పల్లెనిద్ర' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులను ఉద్దేశించి సీఐ విజయభాస్కర్ మాట్లాడారు. పల్లెలు అంటే ప్రశాంతతకు మారుపేరని అన్నారు. అలాంటి పల్లెల్లో ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలన్నారు.