60 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ

సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 60 ఫిర్యాదులను స్వీకరించారు. చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు తక్షణ న్యాయం చేయాలని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.