VIDEO: మురికి నీరే త్రాగునీరు
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో పలు వార్డులలో తాగునీరు సమస్య తీవ్రంగా మారింది. పైపులైన్లు పాత బడటంతో మరమ్మతులు కాక, లీకేజీలు ఏర్పడి మురికి నీరు ప్రవహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అదే పైపుల ద్వారా వచ్చే నీరు దుర్వాసనగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పైపు లైన్లను మరమ్మత్తు చేసి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.