VIDEO: నూతన క్రిమినల్ చట్టాలపై విద్యార్థులకు అవగాహన
KRNL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన క్రిమినల్ చట్టాలపై మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సీఐ రామాంజులు, ఎస్సై శివాంజల్ అవగాహన కల్పించారు. భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, సాక్ష్య అధినియమం కీలక అంశాలను వివరించారు. నూతన చట్టాలు తీసుకురానున్న ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేశారు.