అత్యంత వైభవంగా శివలింగానికి ప్రత్యేక పూజలు

అత్యంత వైభవంగా శివలింగానికి ప్రత్యేక పూజలు

కడప: పెద్దతిప్పసముద్రం శ్రీ ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో శివాలయ సేవకులు సనగరం పట్టాభి రామయ్య ఆధ్వర్యంలో శివలింగానికి ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం 6 గంటలకు పంచామృతాభిషేకం, ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. వేద పండితులచే శివలింగానికి పూలతో అలంకరించి సప్తహారతి, నక్షత్రహారతి, పంచహారతి, మహా మంగళహారతి చేపట్టారు.