చేతికొచ్చిన చెరుకు పంట దగ్ధం
VZM: రేగిడి మండలంలో విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని చేతికొచ్చిన 15 ఎకరాల చెరకు పంట దగ్ధమైంది. గురువారం ఓ రైతు పొలంలో చెరకు తొక్కకు నిప్పు పెట్టగా మంటలు పక్కనే ఉన్న ఏడుగురు రైతుల పొలాలకు మంటలు వ్యాపించాయి. సంచారం అందుకున్న పాలకొండ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరి మంటలను అదుపు చేశారు. చెరకు కర్మాగార అధికారులు ఘటనాస్థలికి చేరి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.