పోలింగ్‌ను పర్యవేక్షించిన సైబరాబాద్ సీపీ
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌ను సైబరాబాద్ CP అవినాష్ మొహంతి పర్యవేక్షించారు. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని 19 CCటీవీల ద్వారా మానిటరింగ్ చేశారు. ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని, సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలన్నారు.