పేదరిక నిర్మూలన ప్రభుత్వ ధ్యేయం

NTR: పేదరిక నిర్మూలన ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. మంగళవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ శాంతినగర్ ఎన్టీఆర్ సెంటర్ వద్ద శీలం సీతకు స్వయం ఉపాధిలో భాగంగా పీ-4 పథకం ద్వారా టిఫిన్ బండిని అందచేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.