జాతరకు సిద్ధమైన దిమిలి గ్రామం
VSP: దిమిలి గ్రామం దల్లమాంబ, బురదమాంబ జాతరకు ముస్తాబైంది. రెండేళ్లకోసారి ఈ ఉత్సవాలు కార్తిక మాసంలో జరుగుతాయి. దల్లమాంబ జాతర ఇవాళ జరగనుంది. ఇందుకోసం నాలుగు వేలకుపైగా వెదురు కర్రలను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పండగ సాయంత్రం వరకు సాగుతుంది. యువకులు, పెద్దవాళ్లు వెదురుకర్రలతో కొట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణ. ఈ పండగ మరుసటి రోజు బురదమాంబ జాతర నిర్వహిస్తారు.