VIDEO: ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

TPT: శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలను గోవర్ధనపురం గ్రామంలో శనివారం త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా శ్రీకృష్ణుని ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆరాధన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.