32వ వార్డులో పర్యటించన కార్పొరేటర్
VSP: స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సోమవారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. కృష్ణ గార్డెన్, చలవ తోట, అల్లిపురం ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.