'కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలి'

వరంగల్: జమిలి ఎన్నికల పేరుతో మరోసారి కుట్రలు లేపి భారత పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్‌ని అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న డిమాండ్ చేశారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.