అంబేద్కర్ ఆశయాలు యువత కొనసాగించాలి: MLA

అంబేద్కర్ ఆశయాలు యువత కొనసాగించాలి: MLA

BHPL: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా BHPL జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి MLA గండ్ర సత్యనారాయణ రావు, DCC జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. MLA మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు.