రామచంద్రపురంలో సహాయక చర్యలలో పాల్గొన్న మంత్రి

రామచంద్రపురంలో సహాయక చర్యలలో పాల్గొన్న మంత్రి

కోనసీమ: తుఫాను నేపథ్యంలో వేస్తున్న గాలులకు రామచంద్రపురం యానాం రహదారిలో కోలంక సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. అటుగా వెళ్తున్న మంత్రి సుభాష్ కాన్వాయ్ ఆపి పరిస్థితిని సమీక్షించారు. అధికారులకు చెప్పి చెట్టును తొలగించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.