సబ్సిడీ పథకాల ఋణాల పరిశీలన.!

ప్రకాశం: సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల సబ్సిడీ ఋణాల దరఖాస్తులను సంతనూతలపాడు ఎంపీడీవో సురేశ్ బాబు, బ్యాంకర్లు, సచివాలయ సిబ్బంది పరిశీలించారు. మండలంలో ఈ పథకాలకు సంబంధించి 404 దరఖాస్తులు లభించాయి. మొదటి రోజున 200 దరఖాస్తును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు బ్యాంక్ మేనేజర్ జే ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.