ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

BDK: బూర్గంపాడు మండలం పోలవరం గ్రామం సమీపంలో శనివారం విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొత్తగూడెం నుంచి మణుగూరు వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు జగన్నాధపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.