రెండవ బ్యాచ్ వార్డ్ మెంబర్లకు శిక్షణ
BHNG: గ్రామ అభివృద్ధికి, వార్డు సభ్యుల విధులు పూర్తిగా తెలుసుకునేందుకు శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందని ఎంపీడీవో నాగవేణి, ఎంపీవో ఆవుల కిషన్‌లు అన్నారు. సోమవారం రాజాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పాలనపై 2వ బ్యాచ్ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 4 నుంచి 10వ తేది వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతావని అన్నారు.