ఇందిరమ్మ మోడల్ ఇండ్ల నిర్మాణ పనుల పరిశీలన

KMR: దోమకొండ మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి పనులు చేసే కూలీలకు పలు సలహాలు, సూచనలు చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలో 367 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన సూచించారు.