జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పంకజ్ కుమార్ మీనా

జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పంకజ్ కుమార్ మీనా

ASR: చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా నియమితులయ్యారు. ఈ మేరకు డీజ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన చింతూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలన, మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణకు విశేష కృషి చేశారు. ఈ క్రమంలో ఆయన జిల్లా అదనపు ఎస్పీగా నియమితులయ్యారు.