VIDEO: మోహిని అవతారంలో వేంకటరమణ స్వామి

CTR: పుంగనూరులో శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజు మంగళవారం ఉదయం మోహిని అవతారంలో శ్రీనివాసుడు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు శ్రీవారిని దర్శించగా మహిళలు కర్పూర హారతులు పట్టారు. ఇవాళ సాయంత్రం గరుడసేవ జరగనుంది. ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది.