VIDEO: నగరంలో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్
HYD: ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అంటూ శశికాంత్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతను ఇద్దరు గన్మెన్లను పెట్టుకుని స్పెషల్ ఆఫీసర్ అంటూ, పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ బిల్డర్ల దగ్గర డబ్బులు వసూల్ చేశాడు. తీసుకున్న డబ్బు ఇవ్వకుండా గన్మెన్లతో బెదిరించినట్లు బాధితులు పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు ఫిల్మ్నగర్లో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.