రేపటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు

రేపటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు

NZB: సిరికొండ మండలంలోని వార్డు సభ్యులకు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి తెలిపారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.