'భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్ పూర్తి చేయాలి'
ELR: భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్ పనులను త్వరగా చేపట్టాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా.. నిన్న ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్‌కు సంబంధించి వివరాలు తెలిపారు. పనులు వెంటనే మొదలుపెట్టే విధంగా రైల్వే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.