'మహాసభలనువిజయవంతం చేయండి'

యాదాద్రి: తుర్కపల్లి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం రేపు శుక్రవారం జరగబోయే తొమ్మిదవ మండల మహాసభలను విజయవంతం చేయాలని మండలాధ్యక్షుడు మారగోని శ్రీరామమూర్తి పిలుపునిచ్చారు. కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని హక్కులను సాధించుకోవాలని కోరారు.