ఖిలా వరంగల్ కోట.. కాకతీయుల వారసత్వం
WGL: నగరంలోని ఖిలా వరంగల్ కోట 13వ శతాబ్దానికి చెందిన ప్రాచీన కట్టడం. ఇది కాకతీయ సామ్రాజ్యపు రాజధానిగా ప్రసిద్ధి పొందింది. ఈ కోట నిర్మాణాన్ని గణపతి దేవుడు ప్రారంభించగా, రుద్రమదేవి, ప్రతాపరుద్ర 2 విస్తరించారు. 3 ప్రాకార గోడలతో నిర్మించిన ఇది శత్రు దాడులను తట్టుకునేలా రూపకల్పన చేయబడింది. కోటలో ఆకర్షణగా కాకతీయ కళా తోరణం నిలుస్తోంది. ఈ శిల్ప ద్వారం రాష్ట్ర చిహ్నంగా గుర్తింపు పొందింది.